Rana: నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు

ఇటీవల పలు ఓటీటీలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఒకటి పూర్తయిన వెంటనే మరొక టాక్ షో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ఇటీవల బాలకృష్ణ తన హోస్టింగ్ తో అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ముగిసిన మరుసటిరోజే మరో సరికొత్త టాక్ షో ప్రారంభమైంది. “నిజం విత్ స్మిత” అనే ఈ టాక్ షో సోనీ లివ్ ఓటిటి తెలుగులో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ టాక్ షో కి పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ లో ముఖ్య అతిథులుగా నాచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో నెపోటిజంపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. నెపోటిజంపై రానా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నేపోటిజం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని.. టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకురావడం కుదరదని అన్నారు.

“బాలీవుడ్ లో తొలిసారి నేను నటించినప్పుడు నేనెవరినో సరిగా అక్కడివారికి తెలియదు. దక్షిణాది నుంచి వచ్చాను కాబట్టి నాది చెన్నై అనుకునేవారు. నా దృష్టిలో వారసత్వం అనేది కేవలం మనల్ని పరిచయం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప.. ఒక్కసారిగా మనం స్టార్స్ కాలేము. ఏదో ఒక రోజు ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ గా మారుతుందని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలోనే అనుకున్నాను. కానీ 9 ఏళ్ల పాటు నా మాట ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు చూస్తే మనం అంతా ఒకటి అయిపోయాం ” అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు