Rangamarthanda: సాహో కృష్ణ వంశీ

కొన్ని సినిమాలు మనకు వినోదాన్ని ఇస్తాయి..
ఇంకొన్ని సినిమాలు మన మెదడుకు పనులు చెబుతాయి..
కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే మన హృదయాన్ని బరువెక్కిస్తాయి.
సినిమా అయిపోయినా కూడా మనలను వెంటాడుతుంటాయి.

చాలా ఏళ్ళ తరువాత దర్శకుడు కృష్ణవంశీ అలాంటి సినిమానే తెరకెక్కించాడు. అదే “రంగమార్తాండ”. ఈ సినిమా నటసామ్రాట్ కి ఆఫీసియల్ రీమేక్ గా తెరకెక్కినదే అయినా, మన మూలాలను అత్యద్భుతంగా తవ్వితీశాడు దర్శకుడు కృష్ణవంశీ.

ఈ సినిమాలో ఒక ఆర్ద్రత ఉంది. ఈ సినిమాలో ఒక ఫిలాసఫీ ఉంది.
ఈ సినిమాలో జీవం ఉంది. ఒక సగటు మనిషి జీవితం ఉంది.
అందుకే ఈ సినిమా ఎప్పటికి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది.

- Advertisement -

“మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే”

అని కార్ల్ మార్క్స్‌ చెప్పిన మాటలకు అద్దం పడుతుంది “రంగమార్తాండ” సినిమా. నర్తనశాలే నిలయమైన ఒక నటుడు కథను, వ్యథను హృదయాన్ని కదిలించగలిగేలా చెప్పి సక్సెస్ అయ్యాడు కృష్ణ వంశీ.

ఈ సినిమా ఒక ఆల్చిప్ప అయితే.. ఆ ఆల్చిప్ప లో అనేక ఆణిముత్యాలను పొందుపరిచాడు దర్శకుడు కృష్ణవంశీ. ముళ్ళపూడి వెంకటరమణ, త్రిపురనేని గోపీచంద్, వేటూరి సుందర రామమూర్తి వంటి ప్రముఖులు చెప్పిన మాటలు కథానుగుణంగా వినిపించిన సందర్భాలలో కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం.

ఏం పొందావో విజయం అంతా అభినయమే కానీ, అనుభవమేముంది ?
నీ కొలువు ఏది విరాటపర్వం కాదా , ముగిసిందా నీ అజ్ఞాతవాసం ?
ఏమి తెలుసయ్యా సమరం , ఏమి పొందావో విజయం.
నీ యుద్ధం నీలో ఉండి నిన్నోడించింది.
చప్పట్లను బోంచేస్తూ, ఈలలను శ్వాసిస్తూ కేవలం రంగస్థలం పై నాటకాలు వేసే రాఘవరావు ను, నిజజీవితంలో ఎంతమంది నటులున్నారో, వాళ్ళు మనకు ఎటువంటి అనుభవాలను చూపిస్తారో అంతర్మథనంతో యుద్ధం ఎలా ఉంటుందో అని సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ప్రశ్నిస్తుంది.

ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం లాంటి గొప్ప నటులను చూసాం. వాళ్ళు చాలా సినిమాల్లో జీవించారు అని చెప్పుకున్నాం. కానీ రంగమార్తాండ సినిమా ప్రస్తావన కి వస్తే రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్) , చక్రపాణి (బ్రహ్మానందం)పాత్రలలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం లాంటి హాస్యనటుడితో కూడా ప్రేక్షకుడిని ఏడిపించొచ్చు అని నిరూపించిన కృష్ణవంశీ సాహసం హర్షించదగ్గది. సినిమాకు ఇళయరాజా ఆరో ప్రాణం.

ప్రీమియర్ షోస్ తో చాలామందిని ఆకట్టుకుంటున్న “రంగమార్తాండ” చిత్రం. మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమ్మ నాన్నలతో చూడాల్సిన, మన అమ్మానాన్నల కథే ఈ రంగమార్తాండ చిత్రం.
సాహో కృష్ణ వంశీ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు