Ranjithame : తమిళ వెర్షన్ లాంటి ఫీల్ లేదు..

విజయ్ తలపతి కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న సినిమా ‘వారసుడు’. తమిళ సినిమా ‘వారిసు’ కు తెలుగు అనువాదం ఇది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అదే ‘రంజితమే’. ఇప్పుడు ఆ సాంగ్ తెలుగు వెర్షన్ విడుదల చేశారు. తమిళంలో ‘రంజితమే’, పాటను విజయ్ పాడారు. తెలుగులో ఈ పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ఫిమేల్ లిరిక్స్ మాత్రం తమిళంలో పాడిన ఎంఎం మానసి తెలుగులో కూడా పాడారు. తెలుగు పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ ఈ పాటకు బాణి అందించిన సంగతి తెలిసిందే. ఇక రంజితమే తెలుగు వర్షన్ విషయానికి వస్తే, “బొండుమల్లె చెండు తెచ్చా, భోగాపురం సెంటు తెచ్చా, కళ్ళకేమో కాటుక తెచ్చా, వడ్డానం నీ నడుముకిచ్చా,” అంటూ సాగిన తెలుగు వర్షన్ రంజితమే బాగానే మొదలయ్యింది.

కానీ తర్వాత వచ్చిన “ముంజకాయ పెదాలు, మూతిపళ్ళ జిగేలుతో” అంటూ రొటీన్ స్టఫ్ లోకి వచ్చేస్తుంది. తెలుగు లిరిక్స్, ఒరిజినల్ రంజితమే సాంగ్ ని మ్యాచ్ చేస్తున్నాయి కానీ ఎందుకో తమిళ వర్షన్ విన్న ఫీల్, తెలుగులో రాలేదు. లిరిక్స్ అర్థం కాలేదు కాబట్టి తమిళ రంజితమే వినడానికి బాగుందేమో, తెలుగులో లిరిక్స్ అర్థం అవుతున్నాయి కాబట్టే అంతగా ఎక్కట్లేదు.

- Advertisement -

వినగా వినగా తెలుగు సాంగ్ కూడా నచ్చోచ్చేమో కానీ, ఇప్పటికిప్పుడు అంటే.. తెలుగు వెర్షన్ సాంగ్ లో తమిళ వైబ్ లేదని క్లియర్ గా తెలుస్తోంది. కాగా తమిళం లో సూపర్ హిట్ అయిన రంజితమే సాంగ్, ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు