Rashi: వాటికి సిద్ధపడే ఉన్నాను

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అందాల తార ఎంతోమంది హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. కళ్ళతోనే భావాలు పలికించే అందం రాశీఖన్నా సొంతం అని చెప్పొచ్చు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో బాగా వెనకబడింది.

టాలీవుడ్ లో వర్కౌట్ కాకపోవడంతో తమిళం వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే రాశి ఖన్నా తాజాగా హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధా చిత్రంలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ మూవీ పైనే చాలా ఆశలు పెట్టుకుంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి తన వ్యక్తిగత జీవితం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తన తొలి సినిమా మద్రాస్ కేఫ్ లో నటిస్తున్నప్పుడు నటనే అంటే తనకు ఓనమాలు కూడా తెలియదని చెప్పుకొచ్చింది. అంతలోనే దక్షిణాదిలో వరుస అవకాశాలు రావడంతో.. జీవితంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ నట ప్రయాణం సాగిస్తూ వచ్చానని తెలిపింది.

- Advertisement -

అయితే తాను తెచ్చుకున్న పేరు వెనుక ఎంతో మంది శ్రమ ఉన్నట్లు వెల్లడించింది రాశి ఖన్నా. తన కెరీర్ మొదట్లో ఎదురైనా జయాపజయాలు తనని చాలా బాధించేవని, కానీ ఇప్పుడు జయాపజయాలకు అతీతంగా ఉండటం అలవాటైందని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కొనసాగాలంటే సక్సెస్ అనేది చాలా ముఖ్యం అని చెప్పింది రాశి ఖన్నా.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు