Rashmika : ఎలాంటి అభ్యంత‌రం లేదు

టాలీవుడ్ అగ్ర హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తన్న విషయం తెలిసిందే. రెండు రోజుల కింద‌టే ముంబై ఎయిర్ పోర్టు లో మెరిసిన ఈ బ్యూటీ.. అక్కడి నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్ళినట్టు సమాచారం. అయితే ఈ టూర్ లో రష్మిక తో పాటు లైగర్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఫోటోలు దిగకున్నా, వారు ధరించిన స్పెట్స్ ను ఆధారంగా చేసుకుని.. నేషనల్ మీడియాతో పాటు మన తెలుగు మీడియా కూడా వారు మాల్దీవుల్లో ఒకే చోట ఉన్నట్లు వార్తలు రాశాయి. ఇక ఈ తరుణంలోనే అక్కడి సముద్రం ఒడ్డున దిగిన హాట్ ఫోటోలను ఫాన్స్ కోసం షేర్ చేసింది రష్మిక.

కెమెరాకు హాట్ ఫోజులు ఇవ్వడం తనకు అలవాటేనని ఈ సందర్భంగా పేర్కొంది. కెమెరాకు ఫోజులు ఇవ్వడం నా జీవితంలో భాగమైపోయింది. మీ అందరికీ అందంగా కనిపించేలా ఫోజులు ఇవ్వడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తాజాగా షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఇక ఈ కామెంట్ తో ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ తో లవ్ ఫై కూడా రష్మిక ఇటీవల స్పందించింది.

“నేను హీరోయిన్ ను కాబట్టి అందరూ నా గురించి తెలుసుకోవాలనుకుంటారు. నాపైన అనేకమంది వార్తలు రాస్తారు. మేము 15 మంది క్లోజ్ ఫ్రెండ్స్. అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. విజయ్ తో కూడా క్లోజ్‌గా ఉంటాను. అయితే క్లోజ్‌గా ఉన్నంత మాత్రానా డేటింగ్ చేస్తున్నట్టు కాదు కదా” అని క్లారిటీ ఇచ్చింది రష్మిక‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు