Rashmika: ఆమెను తల్లిదండ్రులు ఏమని పిలుస్తారో తెలుసా..?

నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినిమాలు అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవల్లిగా అదరగొట్టింది. చలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై.. నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే హిందీలో రష్మిక నటించిన తొలి చిత్రం గుడ్ బై. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.

ప్రస్తుతం రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న వారిసు చిత్రంలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేటిజన్లతో చిట్ చాట్ సెషన్ లో పాల్గొంది రష్మిక. ఈ సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రష్మికని తన తల్లిదండ్రులు ముద్దుగా ఏమని పిలుస్తారో చెప్పుకొచ్చింది. తాను ఇంట్లో ఉన్నప్పుడు మోని లేదా మోవా అని తన తల్లిదండ్రులు పిలుస్తారట. ఈ పేరుకి అర్థం ఏంటంటే కొడవ భాషలో కూతురు అని అర్థం.

 

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు