Rashmika: హైదరాబాద్ నా సెకండ్ హోమ్

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయింది రష్మిక. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడుకి మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన లైఫ్ స్టైల్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. హైదరాబాద్ తనకి మరో ఇల్లు లాంటిదని.. ఇక్కడ తనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. ” కర్ణాటక నా సొంత రాష్ట్రం. కొంతకాలం తమిళనాడులో ఉన్నాను. ఆ ప్రాంతంతో నాకు మంచి అనుబంధం ఉంది.

కానీ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా షూటింగ్ ల కారణంగా నేను ఎక్కువ సమయం హైదరాబాదులోనే ఉంటున్నాను. తెలంగాణ కూడా నాకు ఒక ఇల్లు లాంటిది. ఇక్కడ బయటకు వెళ్లినా, సినిమాలకు, రెస్టారెంట్లకు, ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్ళినప్పుడు నార్మల్ గానే వెళ్తా. ఫేస్ కవర్ చేయను. ఎవరైనా నన్ను గుర్తుపట్టి నువ్వు రష్మిక కదా అని అడిగితే.. నేను కాదు అని చెప్పేస్తుంటా.
అది వాళ్లు కూడా నమ్మేస్తుంటారు.

- Advertisement -

ఇలా ఎన్నోసార్లు చేశా. కరోనా కి ముందు, తర్వాత.. ముంబై వాళ్లు నన్ను స్వాగతించిన తీరులో ఎంతో మార్పు కనిపించింది. నన్ను ముంబైలో ఎంతోమంది గుర్తుపట్టి సాధారణంగా మాట్లాడేవారు. వారి ఆఫీసులలో కూర్చోబెట్టి వెయిట్ చేయించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వారు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు” అని చెప్పుకొచ్చింది రష్మిక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు