Rashmika Mandanna : దిద్దుబాటు చర్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ అందుకున్న రష్మిక మరోపక్క బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది.

ఇప్పటికే అమితాబచ్చన్ గుడ్ బై తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ మిషన్ మజ్ను పైనే పెట్టుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

“నటిగా ఇన్ని భాషల్లో పని చేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఇప్పటివరకు నేను మంచి నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. నటిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు” అని రష్మిక పేర్కొన్నారు.

- Advertisement -

అనంతరం ఆమె సోషల్ మీడియా ట్రోలింగ్ పై స్పందించారు. “సాధారణంగా నేను మౌనంగా ఉండే వ్యక్తిని. అందుకే మొదట్లో ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా పట్టించుకోలేదు. ప్రేక్షకులపై నాకున్న గౌరవం అలాంటిది. అది కాక మొదట్లో నా గురించి విమర్శలు చేసేవారు. అవేమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆ ట్రోల్స్.. నా చెల్లి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని అంగీకరించలేకపోతున్నా. నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమే నా బాధ్యత” అని తెలిపారు.

కాగా గతంలో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా గురించి రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమెపై కన్నడ సినీ ప్రేమికుల నుంచి అనేక రకాలుగా ట్రోల్స్ వస్తున్నాయి. దాని నుంచి బయటపడటానికి చాలా విధాలుగా ప్రయత్నించింది. కానీ, పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయాయి. దీంతో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి పై పాజిటివ్ గా మాట్లాడుతుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు