Ravanasura: ‘ప్యార్‌లోన పాగల్‌’.. ‘రావణాసుర’ నుంచి మరో పాట

మాస్ మహారాజ రవితేజ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. సినిమాలో ఎసిబి విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా అను ఇమ్మానుయేల్, మెగా ఆకాష్, ఫరియా అబ్దుల్లాలు నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ తో కలిసి రవితేజ ఆర్ టి వర్క్స్ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో తెరక్కిస్తున్నారు. యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తడికెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.

ప్యార్ లోన పాగల్ అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు అదిరిపోయే ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ స్టెప్పులు చూస్తే, అందరికీ మతి పోవాల్సిందే. అటు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా టాప్‌ లేచిపోయింది. కాగా, ఈ పాటను ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఈ సందర్భంగా తెలిపింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు