Ravanasura: రవితేజ బర్త్ డే స్పెషల్

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.

ఈ చిత్రంలో ఏసీబీ విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రావణాసుర సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.

జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రవితేజ పుట్టినరోజు నాడు ఈ వీడియోను రిలీజ్ చేయడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్.

- Advertisement -

ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ వీడియో విషయానికొస్తే రావణాసుర సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజను చాలా ప్రత్యేకంగా చూపించారు. ఈ మూవీలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ‘హీరోస్ డోంట్ ఎక్సిస్ట్’ అంటూ విడుదల చేసిన ఆ గ్లింప్స్ వీడియో రవితేజ ఫ్యాన్స్ కు అసలైన బర్త్డే గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంది. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు