Ravi Teja:మరో సాలిడ్ హిట్ రీ రిలీజ్

మాస్ మహారాజ హీరోగా నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ సినిమా బాక్సాఫీస్ లో భారీ కలెక్షన్స్ తెచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా రవి తేజ గెస్ట్ రోల్ లో నటించిన వాల్తేరు వీరయ్య కూడా రిలీజ్ అయిన రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సంపాదిస్తుంది. రెండు వరుస విజయాలతో రవి తేజ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అదే జోష్ లో ఒక రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని రీ రిలీజ్ చేస్తే.. రవితేజ ఇమేజ్ మరింత పెరగడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. టాప్ హీరోల కెరీర్ బెస్ట్ మూవీస్ ని 4కె ప్రింట్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే పోకిరి, జల్సా, ఖుషి , ఒక్కడు, వంటి చిత్రాలు రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్లు సంపాదించుకున్నాయి.

అందులో భాగంగా మాస్ మహా రాజా కెరీర్ బెస్ట్ ఫిలిం అయిన ”విక్రమార్కుడు” రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కాస్త సమయం పడతుండటంతో, రవి తేజ కెరీర్ లో సాలిడ్ కామ్ బ్యాక్ హిట్ అయిన ”మిరపకాయ” సినిమాను రవి తేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న రీ రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఎస్.ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ ఆల్బం కూడా చాలా పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. దేనితో మాస్ మహారాజ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ కు ఎంత కలెక్షన్స్ సంపాదించనుందో వేచి చూడాలి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు