Vikram Vedha : తెలుగు రీమెక్ ఉంటుందా ?

దాదాపు ఐదు సంవ‌త్స‌రాల కింద‌ట త‌మిళంలో వ‌చ్చిన ‘విక్ర‌మ్ వేద’ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. త‌మిళంతో పాటు సౌత్ ఇండియా సినీ అభిమానులు ఈ చిత్రం ఎంతో ఆక‌ర్షించింది. త‌మిళంలో ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో వెంట‌నే తెలుగులో రీమెక్ చేయాల‌నే వార్త‌లు విపించాయి. కానీ విక్ర‌మ్ వేద తెలుగులో మాత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

ఇటీవ‌ల ఈ సినిమా హిందీలో విడుద‌ల అయింది. బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రం రీమెక్ అయింది. ఈ చిత్రం విడుద‌లైన సంద‌ర్భంగా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని మంచి రేటింగ్ వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా 5కి మూడు, అంత‌కు మించిన స్థాయిలో ఈ సినిమా రేటింగ్ ద‌క్కించుకుంది. త‌మిళ వెర్ష‌న్‌కి హిందీ రీమెక్ న్యాయం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

త‌మిళ సినిమా రీమెక్ అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్‌లో మంచి హిట్ లేకుండా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఈ సినిమా రావ‌డం విశేషం. ఇదే స‌మ‌యంలో ఆరో సినిమా తెలుగు రీమెక్‌కు కూడా బాలీవుడ్ ఫ‌లితం కాస్త ఊపునిచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే త‌మిళంలో సూప‌ర్ హిట్ కావ‌డం, హిందీలో పాజిటివ్ టాక్ సంపాదించుకోవ‌డంతో ఈ సినిమాను తెలుగులో రీమెక్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఈ చిత్రాన్ని రీమెక్ చేస్తే టాలీవుడ్ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగార్జున పేర్లు వినిపించాయి. కానీ ప్ర‌స్తుతం తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ పేరు బాగా వినిపిస్తోంది. తెలుగులో విక్ర‌మ్ వేద రీమెక్ అయితే హీరోగా ఎవ‌రు న‌టిస్తారో వేచి చూడాలి మ‌రీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు