RGV: సీఎం రేవంత్ రెడ్డిపై RGV సంచలన ట్వీట్ !

RGV sensational tweet on CM Revanth Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శక నిర్మాతలు ఉన్న సన్నతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది సినిమాలతో పాపులర్ అవుతుంటే… మరి కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే సోషల్ మీడియాలో రచ్చ కారణంగా పాపులర్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అయిన వారిలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకరు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు ఏదో ఒకరి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ… తెలంగాణలో కాంగ్రెస్ కు పాజిటివ్ గా వ్యవహరించారు. అయితే ఈ నేపథ్యంలోనే… తాజాగా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిశారు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ తో పాటు పలువురు టాలీవుడ్ పెద్దలు కూడా వచ్చారు.

ప్రతి సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా డైరెక్టర్స్ డే ను టాలీవుడ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రతిసారి మే 4వ తేదీన నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని అనీవార్య కారణాలవల్ల… ఈసారి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మే 19 కి వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ.

- Advertisement -

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా దిగారు. అయితే రేవంత్ రెడ్డి తో ఫోటో దిగిన తర్వాత రాంగోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన క్లోజ్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డిని తాను కలిసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఫైర్ క్రేకర్ అంటూ పేర్కొన్నారు వర్మ. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు