RRR : మళ్లీ రిలీజ్‌ అవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి చేసిన తాజాగా సినిమా “ఆర్‌ఆర్ఆర్‌”. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఒకరికొకరు పోటీగా నటించి, శభాష్‌ అనిపించారు. జక్కన్న దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అంటే, దేశ, విదేశాల్లో కూడా అరుదైన రికార్డులను సృష్టించి భారీ కలెక్షన్లను రాబడుతోంది.

ఇటీవల థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా, అక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎఫెక్ట్‌ పెట్టి అమోఘమైన విఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ తో అద్భుతంగా తీశారు. ఇది ఇలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు జపాన్‌ లోనూ రిలీజ్‌ కాబోతోంది.

ఈ అక్టోబర్‌ 21న “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా జపాన్‌ దేశంలో రిలీజ్‌ కాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్‌ మళ్లీ ట్రెండింగ్‌ లోకి వచ్చింది. అటు ఎన్టీఆర్‌, ఇటు చరణ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఈ సినిమా జపాన్‌ లో ఏ మేరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు