RRR : కొనసాగుతున్న జైత్రయాత్ర

ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డుల పంట పండుతుంది. పురస్కారాల వేటలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైన ఈ సినిమా ఇటీవల మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోవడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్ర బోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ గా ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. దీంతో పాటు బెస్ట్ మ్యూజిక్ కేటగిరి లోను లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవానిని ఎంపిక చేసింది. ఈ అవార్డు ప్రధానోత్సవం జరగగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీని గురించి ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్ చేయగా.. ఇదే ఊపులో ఆస్కార్ అవార్డుని కూడా తీసుకురావాలని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ పై చాలామంది భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా అకాడమీ అవార్డును పొందుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ అవార్డులతో ఆస్కార్ పోటీకి దగ్గరవుతున్న సమయంలో మరో రెండు అవార్డులు కూడా రావడంతో ఆస్కార్ పోటీలో మరో అడుగు ముందుకేసింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు