Sai Pallavi: సంచలన నిర్ణయం

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది. హీరోలు సైతం సాయి పల్లవి గొప్ప నటి అంటూ ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల విరాటపర్వం సినిమాతో లేడీ పవర్ స్టార్ అంటూ ఒక ట్యాగ్ కూడా సాయి పల్లవికి వచ్చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి పల్లవి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

గత కొంతకాలంగా సాయి పల్లవి ఏ సినిమాలో కూడా ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుందని సమాచారం. దీనికి గల కారణం సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందుకు కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి ఓ బలమైన కారణం ఉందని సమాచారం.

సాయి పల్లవి ఓ డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే సాయి పల్లవి కోయంబత్తూరులో సొంతంగా ఒక ఆసుపత్రిని నిర్మిస్తుందని.. దానిని ఆమె చెల్లెలు పూజ, సాయి పల్లవి ఇద్దరు కలిసి చూసుకోబోతున్నారని టాక్. అందుకే సినిమాలను వదిలేయలని సాయి పల్లవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులలో కాస్త టెన్షన్ నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు