Sailesh Kolanu : అసలైన సినిమాటిక్ యూనివర్స్

తీసింది ఒకటే సినిమా..
కానీ రెండో సినిమాకే ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఎక్కడో హాలీవుడ్ లో కనిపించే సినిమాటిక్ యూనివర్స్ ను రెండేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్లాన్ వేశాడు.
ఇప్పటి వరకు బయటపడకుండా పకడ్భందీగా వ్యూహాలు రచించి, విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు.
ఈ రోజు తన అతీతమైన ఆలోచనలను బయటపెట్టి ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు.
అతను ఇంకెవరో కాదు..

హిట్ టైటిల్ పెట్టి మరీ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను..

ఒక సినిమా హిట్ అయితే.. వెంటనే సీక్వెల్. ఇది ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే.. సినిమాటిక్ యూనివర్స్. సినిమాటిక్ యూనివర్స్ అంటే సగటు ప్రేక్షకుడికి గుర్తు వచ్చేది.. మార్వల్ యూనివర్స్. సూపర్ హీరోలు అంటూ ఒక పెద్ద యూనివర్స్ నే క్రియేట్ చేశారు హాలవుడ్ దర్శకులు. దీనిలో ప్రతి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు మన దేశంలో కూడా చేస్తున్నారు.

- Advertisement -

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మొదటిసారి విక్రమ్ సినిమాతో తాను సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా సినిమాటిక్ యూనివర్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. దీనికిి హిట్ యూనివర్స్ అనే పేరు పెట్టుకున్నట్టు తెలిపాడు. సోమవారం శైలేష్ కొలను నుంచి వస్తున్న హిట్ ది సెకండ్ కేసు అప్డేట్ ఇస్తామంటూ మూవీ యూనిట్ ఓ వీడియోలో ముందుగా అనౌన్స్ చేసింది.

తీరా చూస్తే హిట్ ది సెకండ్ కేసు అప్డేట్ తో పాటు హిట్ యూనివర్స్ ను కూడా డైరెక్టర్ శైలేష్ కొలను అనౌన్స్ చేశాడు. శైలేష్ దూకుడు చూస్తే హిట్ యూనివర్స్ లో చాలా సినిమాలనే తెరకెక్కించేలా ఉన్నాడు. తన యూనివర్స్ లో విశ్వక్ సేన్ మరోసారి కూడా కనిపిస్తాడని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. “కెప్టన్ అమెరికన్ వచ్చిండని.. హల్క్ ను వదిలేస్తామా ?. విక్రమ్ రుద్ర రాజుతో పాటు ఈ యూనివర్స్ లో వచ్చే అధికారులు ఓ పెద్ద కేసును ఛేదిస్తారు” అంటూ తన వ్యూహాన్ని నేడు విడుదల చేసిన వీడియోతో చెప్పేశాడు.

మార్వల్ యూనివర్స్ లో సూపర్ హీరోలు అందరూ కలిసి అవెంజర్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి సినిమాల్లో కనిపించారు. ఇక్కడ హిట్ యూనివర్స్ లో కూడా సూపర్ కాప్ లు అందరూ కలిసి ఒక భారీ సినిమాలో కనిపించేలా శైలేష్ ప్లాన్ చేస్తున్నాడు. నేటి వీడియోలో కూడా అదే కన్ఫామ్ చేశాడు.

ఇదిలా ఉండగా శైలేష్ కొలను ఒక చిన్న దర్శకుడు. తన మొదటి సినిమా హిట్ ది ఫస్ట్ కేసు. ఇప్పుడు హిట్-2. అంటే శైలేష్ తన యూనివర్స్ ను మొదటి సినిమా నుంచే ప్లాన్ చేసుకున్నాడు. ఇంత తక్కువ సమయంలో ఓ యూనివర్స్ క్రియేట్ చేయడం ఇంత సింపుల్ కాదు. కానీ శైలేష్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో ఒక మార్వల్ రేంజ్ యూనివర్స్ ను సృష్టించేశాడు. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వకారణమే అని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు పరదేశ, పరభాష దర్శకుల సినిమాటిక్ యూనివర్స్ ను ప్రశంసిస్తూ.. సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో పోస్టులు వేశారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి యూనివర్స్ ను క్రియేట్ చేసే దర్శకులు లేరు అనే అపోహాకు యంగ్ డైరెక్టర్ శైలేష్ చెక్ పెట్టి, ఆశ్చర్యానికి గురి చేశాడు.

యంగ్ డైరెక్టర్ శైలేష్ చేస్తున్న ఈ ప్రయత్నం హాలీవుడ్ మార్వల్ యూనివర్స్ స్థాయికి వెళ్లాలని ఆశిద్దాం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు