SAINDHAV : డేంజర్ గా.. డెడ్లిగా..

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాను హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బోయినపల్లి వెంకట్ నిర్మిస్తున్నారు. ఇటీవల శైలేష్ కొలను హిట్ యూనివర్స్ తో వరుస హిట్స్ అందుకున్నాడు. అలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నుంచి సినిమా రావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనిలో వెంకీ మామ హీరోగా ఉండటం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

మేకర్స్ జనవరి 23న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసి Venky75 ని అధికారికంగా విడుదల చేశారు. తాజాగా వెంకీ 75 ప్రాజెక్ట్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అలాగే ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సైందవ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో వెంకీ గడ్డం తో, తన చేతిలో ఒక గన్ పట్టుకుని కనిపిస్తాడు. బ్యాగ్రౌండ్ లో ఒక కార్ బ్లాస్ట్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ పోస్టర్ చూస్తే వెంకటెష్ ఒక పవర్ఫుల్ రోల్ గా ఉంటుందని, సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అనిపిస్తుంది.

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. చంద్రప్రస్థ అనే ఒక కల్పిత ప్రదేశం లోకి వచ్చి తన బైక్ మీద ఉన్న ఒక ఐస్ బాక్స్ ని తెరిచి ఒక మెడిసిన్ బాటిల్ ని బయటకు తీస్తాడు. తరువాత తన చేతిలో దెబ్బలు తిన్న రౌడీలకు ”నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడకి వెళ్ళాను… రమ్మను” అని చెప్తాడు.

- Advertisement -

ఈ గ్లింప్స్ ను చూస్తే వెంకటేష్ రోల్ ఎలా ఉంటుందో, ఈ సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనా వచ్చేస్తుంది. గ్లింప్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అట్ట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమా కు సంగీతాన్ని సంతోష్ నారాయణ్ అందించనున్నారు. కాగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు