Saindhav: వెంకీ మూవీలో ముగ్గురు హీరోయిన్లు?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైంధవ్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకట్ బోయినపల్లి ఈ చిత్రానికి నిర్మాత కాగా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం కంటే ముందు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ రానా నాయుడు విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ప్రతి సినిమాలోనూ ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్న వెంకటేష్ ఈ చిత్రంలో మాత్రం హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్లుగా ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

ఇక వెంకటేశ్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని హీరోయిన్ల ఎంపికపై దృష్టి సారించింది మూవీ యూనిట్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని సమాచారం. సైంధవ్ పాన్ ఇండియా చిత్రం కావడంతో ఓ భామను బాలీవుడ్ నుంచి, మరో ఇద్దరిని దక్షిణాది భాషల నుంచి తీసుకోవాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ కథలో సమాన ప్రాధాన్యం ఉంటుందని, అయితే ఏ ఒక్కరూ వెంకీ కి జోడిగా కనిపించరని తెలుస్తోంది. త్వరలోనే వారి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారట.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు