Saakini Daakini : విడుదలకు రెడీ

టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ముఖ్య పాత్రలో వస్తున్న తాజా సినిమా శాకిని డాకిని. స్వామి రా రా, దొచెయ్, రణరంగం లాంటి సినిమాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ ను ఈ నిర్మాతలు సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో శాకిని డాకిని గా తెరకెక్కిస్తున్నారు. ప్రధాన పాత్రలుగా రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లను ఎంపిక చేసుకుని ఈ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీ గా ఉన్నారు.

తాజాగా మూవీ టీం విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న థియేటర్లలో ఈ శాకిని డాకిని సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా ఉన్నాయి. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా వుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు