Sakunthalam: హీరోగా ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం.పీరియాడికల్ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి సామర్థ్యం ఉన్న గుణ శేఖర్.. ఈ చిత్రాన్ని కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. శాకుంతలం పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రలో మలయాళి నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ తో పాటు ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి.

సినిమా విజువల్ వండర్ గా ఉంటుందని, గుణ శేఖర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను మించేలా ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గుణ శేఖర్ సినిమా గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు. శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర కోసం ముందుగా దేవ్ మోహన్ అనుకోలదట.Guna

ఈ పాత్రకు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సెట్ అవుతాడని గుణ శేఖర్ భావించారట. దీనిపై దుల్కర్ ను సంప్రదించి, స్టోరీ కూడా చెప్పాడట. అయితే అప్పుడు దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాలో ఉండటంతో డేట్స్ క్లాష్ అవుతాయనే ఉద్దేశ్యంతో శాకుంతలంను రిజక్ట్ చేశారని గుణ శేఖర్ వెల్లడించాడు. అందుకే మరో మలయాళి నటుడు దేవ్ మోహన్ ను ఫిక్స్ చేశామని తెలిపాడు. అయితే ఈ పాత్రకు తెలుగు నటులను తీసుకోకపోవడానికి కూడా బలైమన కారణం ఉందని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తెలుగు హీరోలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి అంగీకరించరని, అందుకే తాను మలయాళ నటులతోనే ఈ సినిమా చేయాలని అనుకున్నట్టు గుణ శేఖర్ వివరించాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు