Salman : అందులో నిజం లేదు

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు. ఈ షోకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకు 5 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి అయింది. ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటుంది. బాలీవుడ్ లో ఈ షో 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఈ 16వ షోకు కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ షోకు హోస్టింగ్ చేయడానికి సల్మాన్ ఖాన్ రూ. 1000 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సల్మాన్‌ తాజాగా ఈ వార్తలపై స్పందించాడు. ఒక ఇంటర్య్వూలో ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటే ఇక జీవితంలో నేను పని చేయాల్సిన అవ‌స‌రం ఉండదు. అయితే ఈ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నా. నా సంపాదన ఇందులో నాలుగో వంతు కూడా ఉండ‌దు. ఈ అసత్య వార్త‌ల‌ను ఐటీ, ఈడీ అధికారుతలు కూడా చూస్తున్నారు‘ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే తనకు బిగ్‌బాస్‌ షోకు యాంకర్ చేయడం ఇష్టం లేదంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తాను హోస్ట్ గా చేయనని నిర్వహకులకు కూడా చెప్పినట్లు తెలిపారు. కానీ వాళ్లకు వేరే ఛాయిస్ లేకపోవడంతో మళ్లీ తన వద్దకే వచ్చారని అన్నారు. దీంతో ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు