Samantha: 13 సంవత్సరాల అద్భుత ప్రయాణం

2009 లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏ మాయ చేసావే’ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత రూత్ ప్రభు. మొదటి సినిమా తోనే బ్లాక్బస్టర్ హిట్ ను అందుకొని పవర్ ప్యాక్ కెరీర్ ను స్టార్ట్ చేసింది.

అలా మొదటి సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యశోద’ వరకు ప్రతి సినిమా లోని పాత్రలో తనదైన గుర్తింపును ఏర్పరచుకొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది సమంత. తన నటనతో 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 6 సైమా అవార్డులు అందుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈ భామ ఇండస్ట్రీ కి వచ్చి, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరుగా నిలిచింది.

నటిగానే కాకా, సమంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంది. 2012 లో ఇమ్మ్యూనిటి డిసార్డర్ తో బాధ పడిన సమంత 2 నెలలు బ్రేక్ తీసుకొని.. కోలుకొని మళ్ళి తిరిగి వచ్చి సినిమాలు కొనసాగించింది. సమంత వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లను చూసింది. అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తనదైన వస్త్ర బ్రాండ్ ను ”సాకి వరల్డ్” అనే పేరుతో బిజినెస్ రంగంలో అడుగు పెట్టింది

- Advertisement -

గత ఏడాది సమంత మరో వ్యాధి భారిన పడ్డ విషయం తెలిసిందే. ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి కూడా సమంత చికిత్స తీసుకొని, తన మనో ధైర్యం తో దాన్ని కూడా దాటి మళ్ళి ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్, విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది. అలాగే సామ్ నటించిన శాకుంతలం వేసవి కానుకగా విడుదల కానుంది.

కాగా సమంత నేటితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో సామ్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. “అభిమానుల ప్రేమ అంతా నేను అనుభవిస్తున్నాను… అదే నన్ను ముందుకు నడిపిస్తుంది… ఇప్పుడు మరియు ఎప్పటికీ, నేను మీ వల్లనే ఇలా ఉన్నాను. ఈ 13 సంవత్సరాలు మరియు ఇప్పుడే నేను మీ కోసమే ఉన్నాను” అంటూ అభిమానులను ఉద్ధేశిస్తూ ట్వీట్ వేసింది.

13 ఏళ్ల ఈ కెరీర్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన కెరీర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడకుండా… ముందుకు నడిపిస్తుంది ప్రేక్షకుల ఆధారాభిమానాలే అని ఎమోషనల్ ట్వీట్ చేసిందని సమంత.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు