Samantha: సోషల్ మీడియా లో మళ్ళి యాక్టీవ్ .

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో సమంత ఒకరు. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ప్రశంసలు అందుకున్న సామ్, గత కొద్ది నెలలుగా ‘మయోసైటిస్’ సమస్యతో బాధపడుతుంది. ఇంట్లోనే ఉంటూ ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్,సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ, అభిమానులతో టచ్ లో ఉంటుంది.

‘మయోసైటిస్’ సమస్యతో బాధపడుతున్న సామ్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా తేలికపాటి వర్కౌట్స్ చేస్తూ కోలుకోవడానికి పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. తన అభిమానులకు అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ మనసులోని భావాలను అందరి ముందు పెట్టింది సమంత.

“మీరు చేయగలిగినవి, మీ చేతిలో ఉన్న వాటిని మాత్రమే నియంత్రణలో పెట్టుకోండి. అలాగే కొత్త ఆలోచనలు, సులభమైన లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మీకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్ణయించుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఉంటాయి” అని సమంత తన పోస్టులో రాసుకొచ్చింది.ఇదే పోస్టుతో అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని చెప్పింది సమంత.

- Advertisement -

సామ్ చేసిన ఈ పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు