Shaakunthalam: సమంత మెచ్చిన “శాకుంతలం”

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా శాకుంతలం సినిమా రూపొందింది. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నారు. అలాగే మోహన్ బాబు, గౌతమి, ఈషా రెబ్బ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అదనపు బలంగా నిలవనుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ బాలనటిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీలో భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. 3D వెర్షన్ లో ఏప్రిల్ 14వ తేదీన శాకుంతలం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ తనయ నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి తాజాగా సమంత స్పందించింది. ఈ సినిమాను తాను చూసానని.. చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చింది. గుణశేఖర్ ఈ సినిమాని తన హృదయానికి చాలా దగ్గరగా ఆవిష్కరించారని చెప్పింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు, నీలిమా గుణ కి కృతజ్ఞతలు తెలిపింది. మరి సమంత మెచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు