Samantha : మొత్తానికి బయటకు వచ్చేసింది

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ ఎక్కువగా సాగుతుంది. యశోద సినిమా రిలీజ్ కు ముందు సామ్ కు మాయోసైటిస్ వ్యాధి వచ్చిందనే ప్రకటన తర్వాత నుంచి ఈ చర్చ ఎక్కువగా సాగుతుంది. ఇది భయంకరమైనదని, ఇప్పట్లో సామ్ కోలుకోవడం కష్టమే అని నెట్టింట్లో తీవ్రమైన ప్రచారం సాగింది. అలాగే సామ్ సైన్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్, ఖుషి మూవీల నుంచి కూడా తప్పుకుందని వార్తలు వచ్చాయి. వీటిని సామ్ టీం ఎప్పటికప్పుడు స్పందించి, ఖండించినా.. ఈ వార్తలు ఆగలేదు.

కానీ తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఎలా అంటే ? దాదాపు మూడు నెలల తర్వాత సమంత బయట ప్రపంచానికి కనిపించింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో సామ్ దర్శనిమిచ్చింది. గాగుల్స్ పెట్టుకుని తన మార్క్ స్టైల్ తో సామ్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీంతో సామ్ ను ముంబై విలేకర్లు కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సామ్ బయట కనిపించడంతో మాయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుందని తెలుస్తోంది.

అయితే మునుపటితో పోల్చితే సామ్ శరీరాకృతిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నిజానికి సామ్ జిమ్, డైట్ ప్లాన్ సరిగ్గా ఉండటం వల్ల ఫిట్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మరింత సన్నగా మారినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సామ్ బయట కనిపించడం ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిస్తుంది. అలాగే ఈ స్టార్ హీరోయిన్ సినిమాల నుంచి తప్పుకోవడం లేదనే క్లారిటీ కూడా వచ్చింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు