Samantha : బ్యాక్ టు యాక్షన్..

హీరోయిన్లకు స్టార్ హోదా అంత ఈజీగా రాదు. ఒక వేళ వస్తే.. అంత ఈజీగా పోదు. అలాంటి స్టార్ స్టేటస్ ప్రస్తుతం టాలీవుడ్ లో సమంతకు ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సామ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చూస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సామ్ ప్రధాన పాత్రలో చేసిన యశోద సినిమా ఇటీవల విడుదలై ఎంత పెద్ద విజయం దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

అయితే, సమంత ఇటీవల మయోసైటీస్ అనే వ్యాధి బారీన పడింది. అప్పుడు కూడా తన క్రేజ్ ఏ మాత్రం పడిపోలేదు. ఈ వ్యాధి నుంచి సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే సామ్ నటిస్తున్న శాకుంతలం సినిమాను పూర్తి చేసి, బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ లో సామ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ సెట్స్ లో సమంత అడుగుపెట్టింది.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ కసరత్తులు చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. చేతికి బాక్సింగ్ ప్యాడ్స్ పెట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ కి ప్రాక్టిస్ చేస్తోంది. కాగా సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా దుమ్ములేపుతుంది. ఇప్పటికే సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, యశోద సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసింది. వీటికి మంచి గుర్తింపు కూడా వచ్చింది.

- Advertisement -

ఇప్పుడు సిటాడెల్ లో కూడా సామ్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. అందుకే సమంత ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు సమాచారం. కాగా ప్రస్తుతంం సిటాడెల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో పాటు విజయ్ దేవకొండతో ఖుషి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేందుకు సమంత రెడీగా ఉంది. ఖుషి రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు