Samantha : డెడికేషన్ తో..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ముఖ్య పాత్ర లో చేస్తున్న తాజా చిత్రం యశోద. హరి-హరీష్ దర్శక ద్వయం స్వీయ రచనలో వస్తున్న ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ లో కనిపించిన టైటిల్ రోల్ లో సమంత తో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ నటన ఆకట్టుకుంది.

ముఖ్యంగా ట్రైలర్ లో సమంత యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పోలీసులతో సమంత చేసే పోరాట సన్నివేశాలు ట్రైలర్ కే హైలైట్ గా నిలిచాయి. కాగా ఈ చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ గా హాలీవుడ్ కు చెందిన యానిక్ బెన్ పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ యశోద సినిమాలోని పోరాట సన్నివేశాలకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ ఆధ్వర్యంలో సమంత ఫైట్స్ చేస్తుంది. అలాగే యాక్షన్ సీన్స్ సమయంలో సమంత డెడికేషన్ గురించి కూడా యానిక్ ప్రస్తావించారు.

యశోద చిత్రంలో సామ్ ప్రతి సన్నివేశంలో ఎంతో డెడికేషన్ తో చేసిందని ఆయన అన్నారు. ప్రతిసారి బెస్ట్ ఫర్మామెన్స్ ఇవ్వడానికి సామ్ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు