Samantha : ప్రాణాంతక వ్యాధితో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఆరోగ్యం గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స‌మంత అనారోగ్యం విష‌యాన్ని అధికారికంగా తెలుపుతూ ఓ క్లారిటీ ఇచ్చింది.

స‌మంత న‌టించిన య‌శోద చిత్రం కోసం చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే డ‌బ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మ‌రోవైపు సినిమాను పూర్తి చేసేందుకు స‌మంత శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తోంది. ‘‘యశోద’ ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది.

గ‌త కొద్ది నెలల నుంచి ‘మయోసిటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త‌ నిలకడగానే ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ’’ అని రాసుకొచ్చింది సమంత.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు