Samantha: ఫ్యాన్ కి “థాంక్యూ మై లవ్” అంటూ హీరోయిన్ పోస్ట్.. వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత సినిమాలకు, ఆమె నటనకు ఫ్యాన్స్ ఉంటారు. అలాగే సామ్ తన జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొన్న తీరుకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి భారీన పడినప్పుడు ఆమె ఫ్యాన్స్ అండగా నిలబడటంపై సామ్ చాలా సార్లు భావోద్వేగంగా పోస్ట్ చేసింది. పలు ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి చెప్పుకొచ్చింది.

అలాగే ఇటీవల సమంత బాలీవుడ్ డెబ్యూ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో చేతులకు గాయం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సామ్ అభిమానులు పోస్ట్ లు కూడా పెట్టారు. అయితే తాజాగా srusam అనే సమంత ఫ్యాన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. సిటాడెల్ షూటింగ్ లో గాయపడ్డ చేతలను పెన్సిల్ స్కెచ్ వేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలాగే “నేను మీ సక్సెస్ కి మాత్రమే ఫ్యాన్ కాదు. మీ హార్డ్ వర్క్, కమిట్ మెంట్, కైండ్ నెస్ కి హ్యూజ్ ఫ్యాన్ ని. ఈ గిఫ్ట్ ని 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాను. కానీ, అప్పుడు అది కుదరలేదు. అందుకే ఇప్పుడు ఇస్తున్నా.. ఇది మీకు నచ్చుతుందని అనుకంటున్నా..” అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

దీన్నీ చూసిన సమంత రిప్లే కూడా ఇచ్చింది. థాంక్యూ మై లవ్ అంటూ రియాక్ట్ అయింది. అలాగే సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా తన ఫ్యాన్ పోస్ట్ ను, ఆ పెన్సిల్ ఆర్ట్ ను షేర్ చేసింది.

- Advertisement -

కాగా ప్రస్తుతం సామ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ లో తన పాత్ర షూటింగ్ ను కొంత వరకు పూర్తి చేసుకున్న సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. మరో వైపు.. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోయే శాకుంతలం మూవీ ప్రమోషన్ లలోనూ యాక్టీవ్ గా పాల్గొంటుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు