Yashoda : ఓటీటీ రిలీజ్ కు అడ్డంకి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు హరి హరీష్ దర్శకత్వంలో రూపొందిన “యశోద” సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.

అలాగే సమంత కోసం ఈ చిత్రంలో ఏకంగా మరో నలుగురు హీరోయిన్స్ నటించడం విశేషం. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ కి ఊహించని దెబ్బ తగిలింది. ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. EVA IVF ఆసుపత్రి యాజమాన్యం యశోద సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తమ ఆసుపత్రి విశ్వసనీయతకు భంగం కలిగించేలా యశోద సినిమాను చిత్రీకరించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే వాదనలు నమోదు చేసుకున్న కోర్టు.. డిసెంబర్ 19 వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయరాదని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే యశోద ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19 కి వాయిదా వేసింది. దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు