Samantha: బ్యాక్ టు సెట్స్

2010లో ”ఏ మాయ చేసావే” సినిమా తో ప్రేక్షకులని మాయ చేసిన సమంత మొదటి సినిమా నుంచే మంచి ఫ్యాన్ బేస్ క్రియాట్ చేసుకుంది.ఆ తరువాత ఈగ, అ ఆ,యు టర్న్, రంగస్థలం,మజిలీ, యశోద వంటి సినిమాలతో ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఈ భామ కేవలం హీరోయిన్ గానే కాకా, స్పెషల్ సాంగ్ లో, నెగటివ్ రొలెస్ లో కూడా తన పెర్ఫార్మన్స్ తో తనకంటూ ఓ స్టైల్ ని క్రేజ్ ని ఏర్పరచుకుంది.

ఇటీవల, మయోసిటిస్ అనే వ్యాధి భారిన పడిన సమంత, కొంత కాలం బ్రేక్ తీసుకొని చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన వ్యాధి తో కూడా పోరాడి ఇప్పుడు మెల్లగా కోలుకుంటుంది సమంత. ఈ వ్యాధి సోకిన మొదట్లో, తాను చికిత్స తీసుకుంటూనే యశోద సినిమా కు దుబ్బింగ్ చెప్పింది.

ఇక సమంత తరువాతి సినిమా ”శాకుంతలం”. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి సామ్ హాజరు అయి ఫ్యాన్స్ కు కనిపించింది.తాజాగా సామ్ తన వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలు పెట్టిందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సమంత ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉంది. గతంలో సామ్ నటించిన వెబ్ సిరీస్ ” ఫ్యామిలీ మాన్” సామ్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయిన ”రాజ్-డి.కె ” దర్శకత్వంలో ”సిటాడెల్” అనే ఇంకొక వెబ్ సిరీస్ లో నటిస్తుంది సామ్.

- Advertisement -

సిటాడెల్ డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా సమంత షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సామ్, మోడరన్ లుక్‌లో స్టైలిష్ కాప్‌గా కనిపిస్తోంది. ఈ పోస్ట్ తో సమంత ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. హాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ ‘రుస్సో బ్రదర్స్’ నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను సీటాడెల్‌ అనే ఫ్రాంచైజ్‌లో భాగంగా ఇండియన్‌ స్పై థ్రిల్లర్‌ సీరిస్‌గా రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరో వరుణ్ ధావన్ మెయిన్‌ లీడ్‌ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్‌ పోషిస్తోంది.

ఇక ఓ నెటిజెన్ సమంత ను ‘ఖుషి” సినిమా గురించి అడిగారు. దానికి ”విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాను” అని రిప్లై ఇచ్చింది.సినిమా ఆలస్యం కావడంతో హర్ట్ అయిన విజయ్ అభిమానులకు సమంత క్షమాపణలు చెప్పింది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు