Samyukta: పేర్ల వెనుక తోకలు ఎందుకు?

కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో పాపకార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో రానాకు జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారలోను నటించి అదరగొట్టింది.

ప్రస్తుతం ధనుష్ తో “సార్” చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. సంయుక్త మీనన్ గా ఉన్న తన పేరును సంయుక్తగా మార్చుకున్నాను అని.. దానికి గల కారణాలను కూడా వెల్లడించింది.

“నా పేరు వెనుక మీనన్ ను కొనసాగించకూడదనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. స్కూల్లో చేరినప్పుడు ఇంటి పేరుతో సహా మన పేరుని రాస్తుంటారు. నాక్కూడా సంయుక్త మీనన్ అనే పేరును నమోదు చేశారు. కానీ దాని గురించి అప్పట్లో అంతగా అవగాహన లేదు. రాను రాను ఒక వ్యక్తి పేరు వెనక ఎందుకు ఇలాంటి తోకలు ఉండాలి? అనే ఆలోచన నాలో మొదలైంది.

- Advertisement -

నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాదు నా తల్లిదండ్రులు ఎంతో కాలం క్రితం విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరుని కొనసాగించడం మా అమ్మకి ఇష్టం లేదు. నాతల్లి భావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సోషల్ మీడియా, నేను నటించే సినిమాలలోనూ సంయుక్త గానే ఉంటుంది. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. అందువల్ల ఎమోషనల్ సీన్స్ లో నటించడం నాకు సవాలుగా అనిపించలేదు” అంటూ చెప్పుకొచ్చింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు