Sundeep Kishan : హిట్ కోసం సర్వం సిద్ధం

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యువ హీరోల్లో అసలు ఏ మాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుక పడ్డాడు సందీప్ కిషన్. ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ లేకుండా సతమతమవుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ తరుణంలోనే సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్‘.

రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా మైఖేల్ సినిమాపై అంచనాలను కూడా పెంచింది. ఇక ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మైకేల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. జనవరి 21న ట్రైలర్ రిలీజ్ చేసి మేకర్స్ ‘మైఖేల్’ సినిమాని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకొని రానున్నారు. ఇక శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది.

- Advertisement -

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings and all the Entertainment News.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు