Sara Ali Khan : డేటింగ్ నిజమేనా ?

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ కూతురుగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సారా, తొలి చిత్రం ”కేదార్ నాథ్” తో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఈ చిత్రానికి గాను సారా అలీ ఖాన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది. తర్వాత నటించిన ”సింబా” కూడా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీని తర్వాత వచ్చిన రెండు సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈమె మరో రెండు చిత్రాల్లో నటిస్తుంది.

ఇది ఇలా ఉండగా, సారా అలీ ఖాన్ సినిమాల గురించి ఎన్ని వార్తలు వస్తాయో, ఈమె డేటింగ్ కు సంబంధించి కూడా అన్నే వార్తలు వస్తాయి. ఈ స్టార్ హీరో కూతురు.. క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో డేటింగ్ లో ఉన్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విధితమే. దీనిపై సారా కానీ, శుభ్ మాన్ గిల్ కానీ ఎప్పుడు స్పందించలేదు. అయితే తాజాగా సారా తో డేటింగ్ పై క్రికెటర్ శుభ్ మాన్ గిల్ స్పందించిన తీరుతో డేటింగ్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

ఒక షోకు హాజరైన శుభ్ మాన్ గిల్ కు హోస్ట్ నుంచి సారా తో డేటింగ్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. దీనికి గిల్ ”సారాకు మొత్తం చెప్పేశాను. ఇక డేటింగ్ లో నేను ఉండచ్చు. ఉండకపోవచ్చు” అని కామెంట్ చేశాడు. దీంతో సారా, గిల్ ప్రేమలో ఉన్నారని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇక్కడ సారాకు గిల్ పూర్తిగా ఏం చెప్పాడు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఏది ఏమైనా గిల్ వ్యాఖ్యలతో వీరి మధ్య ప్రేమ ఉందని ఒక క్లారిటీ వచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు