Zara Hatke Zara Bach Ke: చిన్న సినిమాతో వచ్చి బాలీవుడ్ ని కాపాడిన హీరోయిన్

బాలీవుడ్ లో వరుస బెట్టి పెద్ద సినిమాలు ప్లాప్ అవుతున్న తరుణంలో చిన్న సినిమాగా వచ్చిన “ది కేరళ స్టోరీ” బ్లాక్ బస్టర్ హిట్ అయి దాదాపు 250 కోట్లు కొల్లగొట్టింది. అయితే కాంట్రవర్సీ చిత్రం గా వచ్చిన ఈ సినిమాకు అందరు ఆడియన్స్ చూసేలా లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ నుండి పలు ప్లాప్ సినిమాలు వచ్చాయి. అలాంటి సిట్యుయేషన్ లోనే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా మంచి మౌత్ టాక్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తుంది.

ఆ సినిమాయే “జరా హట్కే జర బచ్ కే”. సింపుల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా స్టొరీ పాయింట్.. జాయింట్ ఫ్యామిలీల్లో ఉండే హీరో హీరోయిన్స్ వేరు ఫ్యామిలీని పెట్టుకోవాలి అని అనుకుని, ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఒక ప్రభుత్వ పథకాన్ని వాడుకోవాలి అని డైవర్స్ నాటకం ఆడతారు, కానీ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా స్టొరీ. చాలా సింపుల్ స్టొరీనే గా కామన్ ఆడియన్స్ కి వాళ్ళ రియల్ లైఫ్ లకి కనెక్ట్ అవుతుంది. కామెడీ ప్రధానాంశం గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.

విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్ల కోసం యూనిట్ మొత్తం బాగా కష్టపడింది. ముఖ్యంగా హీరోయిన్ సారా అలీఖాన్ ఇండియాలో పెద్ద సిటీ ఏరియాల్లో, వీధుల్లో తిరుగుతూ విపరీతమైన ప్రచారం చేసింది. అందువల్ల సినిమా బి,సి థియేటర్లలో బాగా ఆడుతుంది. పైగా చిత్ర యూనిట్ ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అని అనౌన్స్ చేయడంతో జనాలు ఎగబడి థియేటర్లకు వస్తున్నారు. ఫస్ట్ డే 5.50 కోట్లు రెండో రోజు 7.20కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజు 10కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా సారా అలీఖాన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించిందని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు