Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు – మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” ప్రపంచ వ్యాప్తంగా గురువారం థియేటర్స్ లో రిలీజ్ అయింది. రెండున్నర ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం, పరశురామ్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ తో భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీకి బెనిఫిట్ షోల నుండి మిశ్రమ స్పందన వస్తుంది.

అయితే ఈ సినిమా కలెక్షన్స్ ల్లో మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో 36.63 కోట్లతో మంచి ఓపెనింగ్ ను అందుకుంది. అత్యధికంగా నైజం ఏరియాలో 12.24 కోట్లను కొల్లగొట్టింది. దీని తర్వాత గుంటూర్ లో 5.83 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.73 కోట్లు వసూళ్లు చేసింది. ఈస్ట్ గోదావరిలో 3.25 కోట్లు, వెస్ట్ గోదావరి 2.74 కోట్లు, కృష్ణ లో 2.58 కోట్లు, నెల్లూరు లో 1.56 కోట్ల రూపాయలను రాబట్టింది.

తెలుగులో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు చేసిన మూవీ లీస్ట్ లో భీమ్లా నాయక్, ఆచార్య, అరవింద సమేత వీర రాఘవ, సాహో సినిమాలను క్రాస్ చేసేసింది. దీనికి ముందు.. ఆర్ఆర్ఆర్ మూవీ 74.11 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అలాగే 43 కోట్లతో బాహుబలి-2,  సైరా నరసింహ రెడ్డి 38.75 కోట్లతో ముందు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు