Sarkaru Vaari Paata: అన్ని కోట్లు ఎలా వస్తున్నాయో.?

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే అది హిట్ ఆ , ప్లాప్ ఆ అని తెలియడానికి కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు అలా కాదు ఇక్కడ షో పడకముందు ,యూఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి.
ఇంకో మూడు వారాలు ఆగితే ఆ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది.
ఒకప్పుడు రికార్డ్స్ అంటే సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేలా ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు రికార్డ్స్ అంటే కలక్షన్స్.

ఇదే అనువుగా తీసుకుని కొన్ని సినిమాలు ఫేక్ కలక్షన్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాకి మిశ్రమ స్పందన వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ మూవీ టీం మాత్రం సాయంత్రానికే బ్లాక్ బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసారు . ఈ సినిమానే కాదు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది.

సర్కారు వారి పాట సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 75 కోట్లు వరకు వచ్చాయి, మొదటి రోజు సినిమా చూడాలి అనే ఉత్సాహం అందరికి ఉంటుంది కాబట్టి మొదటి రోజు ఆ రేంజ్ లో కలక్షన్స్ వచ్చాయి అంటే నమ్మశక్యంగానే ఉంది. కానీ రోజురోజుకి అనౌన్స్ చేస్తున్న కలక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కావట్లేదు. హిట్ టాక్ కూడా రాకుండా ఆ రేంజ్ కలక్షన్స్ ఎలా వస్తున్నాయో ఆ మూవీ టీం కే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు