Satyadev : కొత్త సినిమా షురూ

ప్రామిసింగ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేశారు. హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. తన నట విశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకు బ్లఫ్ మాస్టర్ తో చూపించారు. దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి విలన్ గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా సత్యదేవ్ తన కెరీర్ లో 26వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రాంరభమైంది. పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ కూడా శుక్రవారమే షురూ అయింది.

కాగా ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో పుష్ప ఫేమ్, కన్నడ నటుడు డాలీ ధనంజయ కీలక పాత్ర పోషించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు