Andhadhun : నాగార్జునతో కాకుండా టబు ఆ విలన్ తో కూడా ఎఫైర్ పెట్టుకుందా..?

తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ టబు ఒకరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి తన గ్లామర్ షో తో యువతను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేస్తూ.. లేటు వయసులో కూడా ఘాటు అందాలను ప్రదర్శిస్తుంది. నిజానికి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈమె, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈమె ఐదు పదుల వయసు దాటిన కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.

అయితే టాలీవుడ్ లో టబుకి ఎఫైర్ ఉందని చాలా కాలం రూమర్స్ వచ్చాయి. టబూ – అక్కినేని నాగార్జున వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించిన కారణంగా ఏదో సంబంధం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వెలుపడ్డాయి. దాదాపు పదేళ్లపాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. నాగార్జున టబు కి ఒక ఫ్లాట్ కూడా గిఫ్ట్ ఇచ్చారని అప్పట్లో టాక్. అయితే నాగార్జున ఒక్కరితోనే కాకుండా టబూ ఓ విలన్ తో కూడా ఎఫైర్ పెట్టుకుందట.

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు మొదట్లో హీరోగా చేసి, ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న మనోజ్ వాజ్పేయి. వీరిద్దరూ కలిసి దాదాపు మూడు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాలలో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని.. అది కాస్త డేటింగ్ వరకు దారి తీసింది అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో టబు కి పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో యువ హీరోలకు తల్లిగా కూడా చేయడానికి ఆమె రెడీ అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు