Yashoda : తెరపైకి సీక్వెల్

సమంత ప్రధాన పాత్రలో తాజాగా వచ్చిన చిత్రం యశోద. ఈ నెల11వ తేదీన విడుదలైన యశోదకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో సమంత చేసిన యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సమంత కెరీర్ లోనే యశోద బెస్ట్ సినిమా అని అభిప్రాయపడుతున్నారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాగే అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకుంది.

యశోద సినిమా మంచి హిట్ అందుకోవడంతో దీనికి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. తాజాగా దీనిపై దర్శకులు హరి, హరీష్ స్పందించారు. గురువారం రాత్రి నిర్వహించిన యశోద సక్సెస్ మీట్ లో సీక్వెల్ పై హరి, హరీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ”మా తొలి తెలుగు చిత్రం యశోద. మొదటి చిత్రమే ఇంతటి హిట్ అవ్వడం సంతోషంగా ఉంది. యశోద సీక్వెల్ కు సంబంధించి మా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అంతే కాదు.. సెకండ్ పార్ట, థర్డ్ పార్ట్ ను కూడా తెరకెక్కించేందుకు లీడు ఉంది. అయితే సీక్వెల్ అనేది మాత్రం సమంతపై ఆధారపడి ఉంది” అని అన్నారు.

దర్శకులు హరి, హరీష్ చేసిన కామెంట్స్ తో యశోదకు సీక్వెల్ ఉండటం ఖాయమని తెలుస్తుంది. అయితే దీనిపై సమంత ఎలా స్పందించిందో చూడాలి మరి. ఒక వేళ యశోదకు సీక్వెల్ వస్తే ఇంతకి మించి విజయం సాధించడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు