Shaakuntalam : సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రయాణగాత ఆధారంగా మైథలాజికల్ లవ్ స్టోరీ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి, సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు.

ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను 3D లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే శాకుంతలం మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమంత స్క్రీన్ ప్రెసెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ఇటీవల ఈ మూవీ నుంచి మల్లికా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

తాజాగా శాకుంతలం సినిమా నుంచి ఋషివనములోనా.. అంటూ సాగే రెండో సాంగ్ ను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాళిదాస్ రాసిన కథ ప్రకారం చూస్తే ఋషి వనములోనే శకుంతల, దుష్యంతుడు పరిచయం అవుతారు. ఇక్కడే ఈ ఇద్దరు మధ్య ప్రేమపుట్టి గాంధర్వ వివాహానికి దారితీస్తుంది.

- Advertisement -

శకుంతల, దృశ్యంతల ప్రేమను చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు