Shaakuntalam : గుణశేఖర్ అంటే అంతే ఖర్చు తగ్గేదేలే..

తెలుగు దిగ్దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో సమంత ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేడి ఓరియెంటెడ్ భారీ చిత్రం శాకుంతలం. రుద్రమదేవి చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు శకుంతల గా సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నాడు.

అయితే గుణశేఖర్ అంటే టాలివుడ్ లో భారీ బడ్జెట్ భారీ సెట్స్ ఏ కాకుండా భారీ కాస్ట్యూమ్స్ కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయన గత చిత్రం రుద్రమదేవి లో అనుష్క కోసం వాడిన కాస్ట్యూమ్స్ అప్పట్లోనే సెన్సేషన్ అయ్యాయి. అనుష్క కోసం 5 కోట్లు ఖరీదు చేసే నగలను వాడారు. ఇప్ప్పుడు అలాంటి సాహసమే మళ్ళీ చేసాడు గుణశేఖర్.

ఆయన దర్శకత్వం చేస్తున్న శాకుంతలం చిత్రంలో సమంత కోసం ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాడు, ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను ప్రత్యేకంగా సమంత కోసం తయారు చేయించాడు దర్శకుడు. గుణ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. దాదాపు 80కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు దుర్వాస మహర్షిగా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు, గౌతమి ,అనన్య నాగళ్ళ, సచిన్ ఖడేకర్, జిష్షుసేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు

- Advertisement -

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదలకు సిద్ధం అవుతున్నది.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు