Shaakuntalam : విజువల్ వండర్.. మ్యూజికల్ వండర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చేస్తున్న చిత్రం శాకుంతలం. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెర‌కెక్కించే గుణ శేఖర్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన రుద్రమాదేవి ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. తాజాగా గుణ శేఖర్.. మ‌హాక‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని శాకుంతలం అనే సినిమాను ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా తెరకెక్కిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ చూడ‌ని అందాల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై వావ్ అనిపించేలా అద్భుత‌మైన దృశ్య‌కావ్యంగా శాకుంతం సినిమా రానుందని మేకర్స్ చెబుతున్నారు. శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత న‌టిస్తోన్న శాకుంత‌లం చిత్రంలో దుష్యంత మ‌హారాజు పాత్ర‌లో దేవ్ మోహ‌న్ న‌టించారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జోరుగా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘మ‌ల్లికా మ‌ల్లికా..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. “మ‌ల్లికా మ‌ల్లికా మాల‌తీ మాలికా.. చూడ‌వా చూడ‌వా..” అంటూ సాగే పాట అద్భుతంగా ఉంది. పాటలో శాకుంతల త‌న భ‌ర్త దుష్యంతుడి కోసం ఎదురు చూస్తూ.. త‌న చుట్టూ ఉన్న మొక్క‌లు, ప‌క్షులతో మ‌న‌సులోని బాధను అందంగా వ్య‌క్తం చేస్తుంది.

- Advertisement -

సాంగ్ లో విజువ‌ల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. సినిమా విజువల్స్ వండర్ అని ట్రైలర్ తో తెలిస్తే.. మ్యూజికల్ వండర్ అని ఈ సాంగ్ తో తెలిసిపోతుంది. కాగా ఈ పాటకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించగా, చైతన్య ప్రసాద్ రాశారు. రమ్య బెహ్రా ఆలపించారు. కాగా శాకుంతలం ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది.

Mallika Mallika Lyrical Video Song from Samantha’s Shaakuntalam Movie

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు