షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, జాన్ అబ్రాహం ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం “పఠాన్“. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ లోని భాగంగనే ఈ చిత్రం రాబోతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వార్”, సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్, “టైగర్ జిందా హై” లాంటి సినిమాను ఇప్పటికే ఈ స్పై యూనివర్స్ లోనివే అని యష్ రాజ్ ఫిల్మ్స్ ఇటీవల అధికారిక ప్రకటన చేశారు.
దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు భారీగా పెరిగాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఈ చిత్రంతోనే వస్తున్నాడు. ఈ నేపథ్యంలో పఠాన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలీవుడ్ తో పాటు సౌత్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ను చూస్తే.. పఠాన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. జాన్ ఇబ్రహీమ్ ఒక పవర్ ఫుల్ టెర్రరిస్ట్ గా కనిపించబోతున్నారు. ఇక దీపికా పదుకొనె, షారుఖ్ ఖాన్ ఇండియన్ ఆర్మీ ఎజెంట్స్ పాత్రలను పోషిస్తున్నారు. వీరి పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ తో కన్ఫామ్ అవుతుంది. కాగా.. ఒక గ్యాంగ్ భారతదేశంపైకి ఒక శక్తివంతమైన రాకెట్ బాంబును ప్రయోగించాలని ప్రయత్నిస్తోందని, దాన్ని షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె ఎలా అడ్డుకున్నారు ? టెర్రరిస్ట్ జాన్ అబ్రహంను వీళ్లు ఎలా మట్టుబెట్టారు అనేది సినిమాలో ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
కాగా ఈ హై వోల్టేజ్ యాక్షణ్ ట్రైలర్ పఠాన్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. హలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ అంటూ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.