JERSEY : నాని జెర్సీని షాహిద్ బీట్ చేశాడా..?

తెలుగులో “మళ్ళిరావా” సినిమాతో డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేసిన గౌత‌మ్ తిన్న‌నూరి.. నాని తో చేసిన జెర్సీ మంచి హిట్ ఇచ్చింది. 2019 లో రిలీజ్ అయిన జెర్సీ, నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాను గౌత‌మ్ తిన్న‌నూరి బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ తో అదే టైటిల్ తో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రిమ‌య‌ర్ షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తుంది. షాహిద్ క‌పూర్ కెరీర్ లో జెర్సీ చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు. ఆయ‌న యాక్టింగ్ అద్భుతంగా ఉంద‌ని అంటున్నారు.

బాలీవుడ్ లో జెర్సీ సూప‌ర్ స‌క్స‌స్ తో దూసుకుపోతున్న క్ర‌మంలో… ఇండ‌స్ట్రీలో ఒక్క ప్ర‌శ్న ఎక్కువ‌గా వినిపిస్తోంది. తెలుగులో వచ్చిన నాని జెర్సీ సినిమాను షాహిద్ క‌పూర్ జెర్సీ బీట్ చేసిందా అని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. అయితే నాని జెర్సీ ఒక అద్భుతం. వ‌రుస ప్లాప్స్ తో ఉన్న కెరీర్ ను మ‌లుపు తిప్పిన సినిమా జెర్సీ. టాలీవుడ్ లో జెర్సీ ప‌దిల‌మైన స్థానం ద‌క్కించుకుంది. నాని యాక్టింగ్ కు కూడా ఈ సినిమాతో మంచి మార్కులు ప‌డ్డాయి.

అలాగే హిట్స్ లేక ఆక‌లిపై ఉన్న బాలివుడ్ కు ఫుల్ మీల్స్ పెట్టింది షాహిద్ క‌పూర్ జెర్సీ. షాహిద్ లెటెస్ట్ మూవీ క‌బీర్ సింగ్ తో నార్త్ స్టేట్స్ లో త‌న మార్కెట్ ను మ‌రింత పెంచుకున్నాడు. ఇది జెర్సీ క‌లెక్ష‌న్స్ పెంచే అవ‌కాశం ఉంది. దీంతో బాలీవుడ్ జెర్సీ.. వ‌సూళ్ల‌తో కూడా సెన్సెష‌న్ క్రియేట్ చేయనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు