Samantha: శాకుంతలం సినిమాకి అవార్డుల పంట ! అయోమయంలో ఆడియన్స్

ఇటీవలనే సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా గురించి అందరికి తెలిసిందే. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళం యాక్టర్ దేవ్ మోహన్ నటించగా, శకుంతల పాత్రలో సమంత అభినయించింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఇటీవలనే (ఏప్రిల్ 14న ) థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాకి ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన మూవీ టీం, సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులలో అంచనాలు కూడా పెరిగాయి. దాంతో దాదాపు సినిమా హిట్టైనట్టే అనుకోగా, థియేటర్స్ రిలీజైన మొదటి షో నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో, ఎవరు థియేటర్ వరకు వెళ్ళలేదు. ఫలితంగా సినిమా భారీ నష్టంతో థియేటర్ రన్ ముగించుకుంది. ఇటీవలనే ఓటిటిలోకి కూడా వచ్చింది.

అయితే ఇంత నెగిటివ్ టాక్ తో, తెలుగు ప్రేక్షకులని ఇసుమంతనైనా ఎంటర్టైన్ చేయలేకపోయిన శాకుంతలం సినిమా, ఇటీవలనే నిర్వహించినప్రముఖ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫారెన్ ఫిలిం అవార్డుతో ఇతరేతర అవార్డ్స్ గెలుచుకొని అందరికి షాక్ ఇచ్చింది. విషయానికొస్తే ఇటీవల నిర్వహించిన కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా శాకుంతలం సినిమాకి గాను బెస్ట్ ఫారెన్ ఫిలిం అవార్డుతో పాటు కాస్ట్యూమ్ మరియు బెస్ట్ ఫాంటసీ ఫిలిం, బెస్ట్ ఇండియన్ ఫిలిం అవార్డులని సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ శాకుంతలం నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించగా. సమంత కూడా ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అభిమానులతో పంచుకుంది. అయితే నెటిజన్లు మాత్రం శాకుంతలం సినిమాకి ఇన్ని అవార్డ్స్ ఎలా వచ్చాయంటూ షాక్ అవుతూ సోషల్ మీడియాలో మిమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు