Sharwanand : పొలిటీషియన్ గా యంగ్ హీరో ?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా, కెరియర్లో వెనుక పడుతున్నాడు. శర్వ చేస్తున్న సినిమాలేవి ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవడం లేదు. శ్రీకారం, జాను, ఆడాళ్లు మీకు జోహార్లు, వంటి సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. దీంతో ఒక కొత్త కాన్సెప్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. “సంభవామి యుగేయుగే” సినిమా తో పాటలు రాయడం ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించనున్నారు.

బాణం, సోలో, లీడర్ వంటి సినిమాలకు అద్భుతమైన పాటలను అందించాడు కృష్ణ చైతన్య. అయితే కృష్ణచైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఈ చిత్రంలో ఓ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా, ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జయరామ్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు టైటిల్ ఖరారు చేయలేదు. కానీ, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతోనైనా శర్వానంద్ మంచి హిట్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు