Bollywood : రీమేక్ లపై ఆధారపడాల్సిందేనా ?

భారత చిత్ర సీమలో టాప్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అని అంటే.. ఎవరి నుంచి అయినా బాలీవుడ్ అనే వస్తోంది. నిజానికి కొన్ని ఏళ్ల క్రితం బాలీవుడ్ పరిస్థితి అలాగే ఉండేది. బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్ వరకు వెళ్లారు. మన దేశంలో ఉన్న చిన్న ఇండస్ట్రీలు బాలీవుడ్ సినిమాల్లో నటించాలని గోల్ గా పెట్టుకునే వారు. అలాగే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలీవుడ్ నటీనటులే సౌత్ ఇండస్ట్రీలో కనిపించాలని చూస్తున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు బాలీవుడ్ నుంచి రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి కోలీవుడ్ సెన్షెషన్ హిట్ ఖైదీ రీమేక్. మరొకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురములో.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఖైదీని బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ లో నటిస్తున్నాడు. దీనికి అజయ్ దేవగన్ దర్శకత్వం చేయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

అలాగే అలా వైకుంఠపురములో సినిమాను హిందీలో షెహజాదా అనే పేరుతో రీమేక్ అవుతుంది. దీనికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తుండగా, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి-సిరీస్ ఫిల్మ్స్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రోజు రెండు టీజర్లు రిలీజ్ కావడంతో #Remake, #Bollywood అనే హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతే కాకుండా అజయ్ దేవగన్ రీమేక్ స్టార్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు