Shruti Haasan: పెళ్లి ఆలోచనే లేదు

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో శృతిహాసన్ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు తో పాటు ఇతర భాషల్లో క్రేజీ ఫిలిమ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించింది.

ఈమె సినీ జీవితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ముందు, తర్వాత అని పేర్కొంటారు సినీ పరిశీలకులు. అయితే శృతిహాసన్ చిత్రకారుడు శంతను హజారికాతో చాలాకాలంగా ప్రేమలో ఉంది. గత కొద్ది కాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. శంతనుతో శృతిహాసన్ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ ప్రేమ వ్యవహారాన్ని శృతిహాసన్ దాయలేదు.

అతడితో తనకున్న అనుబంధాన్ని గురించి చాలాసార్లు సోషల్ మీడియాలో, లేదా ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించింది. అయితే ఈ మధ్య శృతిహాసన్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రస్తావన తీసుకువస్తున్నారని.. అలా అడగడం తనికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది శృతిహాసన్.

- Advertisement -

“సెలబ్రిటీల పెళ్లి విషయంలో చాలామంది ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారో అర్థం కాదు. మేమిద్దరం సృజనాత్మక రంగంలో ఉన్నాం. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం. మరో రెండు మూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇద్దరం కలిసి సంతోషంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు” అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు